Themes from World History

Themes from World History

Thursday, November 24, 2016

ప్రాచీన భారతంలో ఖగోళ విజ్ఞానం






ప్రాచీన భారతం అనగానేఎంత ప్రాచీనం?’ అన్న ప్రశ్న వస్తుంది.  భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రాచీనమైనవి వేదాలు అన్న విషయంలో పండితులు ఏకీభవిస్తున్నా వేదాలు ఏనాటివి అన్న విషయంలో వివాదం వుంది. వేదాలు క్రీ.పూ. 1000 నాటివి అని కొందరు అంటే కనీసం క్రీ.పూ. 3500 అయ్యుండాలి అని మరి కొందరు. వేదాలలో భాగమైన వేదాంగ జ్యోతిషంలో ఎంతో ఖగోళ  విజ్ఞానం పేర్కొనబడింది, ఎన్నో ఖగోళ ఘటనలు నమోదు చెయ్యబడ్డాయి

క్రీ.పూ. 3000 కాలంలో జీవించిన యాజ్ఞవల్క్యుడుశతపథ బ్రాహ్మణంఅనే ఖగోళశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. అందులో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందనే భావననే బోధించాడు. ప్రాచీన గ్రీకులలో అరిస్టార్కస్ వంటివారు అప్పటికి చాలా కాలం తరువాత (క్రీ.పూ. 270) సూర్య సిద్ధాంతాన్ని బోధించినా, సిద్ధాంతం మరో ఒకటిన్నర సహస్రాబ్దాల కాలం మరుగునపడి మళ్లీ రమారమి క్రీ.. 1500  కాలంలో కోపర్నికస్ వంటి వారి పరిశోధనల ద్వార మళ్లీ ఊపిరి పోసుకుంది. భూమి గోళాకారంలో వున్నదన్న భావన కూడా శతపథ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. సూర్యుడు గోళాలన్నిటికీ కేంద్రంఅని కూడా పుస్తకం వ్యాఖ్యానిస్తుంది. 

   శతపథ బ్రాహ్మణంలోని ఒక శ్లోకంలో (8.7.3.10) ఇలాంటి వర్ణన కనిపిస్తుంది: “ఒక దారం చివర కట్టినట్టు సూర్యుడు భూమిని, గ్రహాలని, వాయుమండలాన్ని తన చుట్టూ తిప్పుకుంటాడు.” వర్ణనలో సూర్యుడు అనే కేంద్రం చూట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. శతపథ బ్రాహ్మణంలో సూర్యుడి మీద ఆధారపడ్డ కాలెండరు కూడా కనిపిస్తుంది.

అలాగే మరో వైదిక గ్రంథమైన ఐతరేయ బ్రాహ్మణంలో సూర్యుడు కదులుతున్నట్టు కనిపిస్తాడు కాని, నిజానికి కదలడు అన్న భావన ఎదురవుతుంది. “నిజానికి సూర్యుడికి ఉదయం, అస్తమయం ఉండవు. అలా అనుకునేవారు పొరబడుతున్నారు.” 

వేద సంహితల ప్రకారం ఏడాదిని 360 రోజులు గాను, 12 నెలలు గాను విభజించడం జరిగింది. అంటే నెలని 30 రోజులుగా విభజించడం జరిగింది. రెండు పున్నముల మధ్య కాలాన్ని, లేక రెండు అమావాస్యల మధ్య కాలాన్ని ఒక నెలగా నిర్వచించడం జరిగింది. అయితే కాలం కచ్చితంగా చూస్తే 30 రోజులు కావని 29.5 రోజులని కూడా కొన్ని చోట్ల పేర్కొనడం జరిగింది.

గ్రహణాల ప్రస్తావన ఋగ్వేదంలో ఎన్నో చోట్ల వస్తుంది. వర్ణన ఎన్నో చోట్ల కథల రూపంలో ఉంటుంది. ఋగ్వేదంలో స్వరభానుడి కథ (ఋగ్వేదం I.164.48) అలాంటిదే.

అప్పుడు రాక్షసుడైన స్వరభానుడు కొట్టిన దెబ్బకి సూర్యుడు చుట్టూ చీకటి క్రమ్మింది. సూర్యుడు కనిపించక విలవిలలాడిన వేలుపులు అత్రి మహర్షిని ఆశ్రయించారు. అప్పుడు అత్రి చీకటిని (క్రమంగా ఇలా) పారద్రోలాడు. మొదటి సారి పారద్రోలబడ్డ చీకటి నల్లని గొర్రెగా మారింది. రెండవసారి పారద్రోలబడ్డ చీకటి వెండి గొర్రెగా మారింది. మూడవసారి పారద్రోలబడినది ఎర్రని గొర్రెగా మారింది. చివరిగా పూర్తిగా పారద్రోలబడ్డ చీకటి తెల్ల గొర్రెగా మారింది.”

పై వర్ణనలో గ్రహణం పట్టిన సూర్యుడి కాంతిలో క్రమంగా వచ్చే మార్పులు కనిపిస్తున్నాయి.

వేదకాలానికి చెందిన ఖగోళవిజ్ఞానం యజ్ఞ యాగాదుల నిర్వహణతోను, అధ్యాత్మిక లక్ష్యాలతోను లోతుగా ముడివడి ఉన్నట్టు కనిపిస్తుంది. కాని క్రీ.. ఒకటవ శతాబ్దం నుండి భారతీయ ఖగోళ విజ్ఞానం కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తుంది. దీన్నేసిద్ధాంత యుగం అంటారు. అంటే ఖగోళశాస్త్రంలో గణితాన్ని విస్తృతంగా ప్రయోగించి ఖగోళ సత్యాలని గణిత సిద్ధాంతాల రూపంలో వ్యక్తం చేసే సాంప్రదాయం మొదలయ్యింది. (ఇంచుమించు అదే కాలంలో యూరప్ లో కూడా అలాంటి పరిణామాలు కలగడం గామనార్హం. విషయాలు ముందుముందు విపులంగా చెప్పుకుంటాము.)

సిద్ధాంత యుగంలోని ప్రముఖ భారతీయ ఖగోళవేత్త ఆర్యభట్టు. క్రీ.. ఐదవ శతాబ్దానికి (క్రీ.. 476-550) చెందిన ఇతడు ఖగోళశాస్త్రానికి గణిత పునాదులు వెయ్యడంలో ఎంతో కృషి చేశాడు. శతాబ్దాలుగా భారతీయ సాంప్రదాయంలో వస్తున్న సూర్య సిద్ధాంతానికి ఇతడు మెరుగులు దిద్దాడు. భూమి తన అక్షంపై తాను తిరుగుతోంది అన్నాడు. గ్రహాల కక్ష్యలని, గ్రహణాలని కచ్చితంగా నిర్ణయించే లెక్కలు కూర్చాడు. ఖగోళశాస్త్రంలోనే కాక గణితంలో ముఖ్యంగా జ్యామితి (geometry) లో, త్రికోణమితి (trigonometry)  లో ఇతడు ఎన్నో చక్కని ఫలితాలు అందించాడు. సంగతులన్నీ అతడుఆర్యభటీయంఅనే కృతిలో పొందుపరిచాడు. 13 శతాబ్దంలో కృతి లాటిన్ లోకి అనువదించబడింది.

 
ఆర్యభటీయంలో గ్రహణాల లెక్కలు వర్ణిస్తున్న ఒక పుట


ఆర్యభట్టుకి సమకాలికుడైన వరాహమిహిరుడు (క్రీ.. 476)  ఖగోళశాస్త్రంలో గురుత్వాన్ని పోలిన భావనని ప్రవేశపెట్టాడు. గ్రహాలు మొదలైన ఖగోళ వస్తువులు అంతరిక్షంలో కొన్ని నియత గతులలో తిరుగుతున్నాయంటే అందుకు ఏదో బలం కారణం అని ఇతడు ప్రతిపాదించాడు. ఖగోళ వస్తువుల మధ్య ఏదో ఆకర్షక బలం ఉండి వుంటుందని ఇతడు భావించాడు.

ఏడవ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు అనే ఖగోళవేత్త భూమి చుట్టుకొలత 36,000 కిమీలు అని అంచనా వేశాడు. ఇది ఆధునిక అంచనాకి చాలా దగ్గరగా వుంది.

సిద్ధాంత యుగం తరువాత అంటే ఏడవ శతాబ్ద కాలంలో మన సంస్కృత గ్రంథాలని అరబిక్ లోకి అనువదించే ఒరవడి మొదలయ్యింది. భారతీయ గణిత ఖగోళ విజ్ఞానానికి మరింత మెరుగైన ప్రయోగాత్మక, పరిశీలనాత్మక పద్ధతులని జోడించి విజ్ఞానాన్ని అరబ్బులు గొప్పగా పోషించారు.