Themes from World History

Themes from World History

Saturday, May 7, 2016

బాల్కన్ రాజ్యాల కలహచరిత్ర



ఒక్క రాజకీయ హత్యకి అంత దారుణమైన పర్యవసానమా? అసలు హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు?
ప్రశ్నలకి కారణాలు శోధిస్తే మొదటి ప్రపంచ యుద్ధానికి మూలాలు అర్థమవుతాయి. సంగతులు వరుసగా పరిశీలిద్దాం.

పైన చెప్పుకున్న హత్య ఎందుకు జరిగిందో తెలియాలంటే ముందు ప్రాంతం యొక్క భౌగోళిక, రాజకీయ చరిత్ర గురించి కొంచెం చెప్పుకోవాలి
 
యూరప్ లో దక్షిణ-తూర్పు భాగంలో బాల్కన్ అనే ద్వీపకల్పం (peninsula)  వుంది. ప్రాంతంలోనే బాల్కన్ పర్వతాలు ఉన్నాయి. బాల్కన్ ప్రాంతంలోనే ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. అవి అలబేనియా, బాస్నియా/హెర్జెగోవినా, బల్గేరియా, క్రొయేషియా, గ్రీస్, కోసొవో, మాసెడోనియా, మాంటెనీగ్రో, సెర్బియా, స్లోవేనియా, రొమానియా.  వాటి మధ్య అనాదిగా సుదీర్ఘమైన కలహచరిత్ర వుంది. (కేవలం రెండు దశాబ్దాల క్రితం, 1992-1995 కాలంలో, బాస్నియాలో చెలరేగిన యుద్ధం వల్ల యుగొస్లావియా దేశం పలు చిన్న చిన్న రాజ్యాలుగా విచ్ఛిన్నమైన సంగతి చాలా మందికి ఇంకా జ్ఞాపకం ఉండే ఉంటుంది.) రాజ్యాలకి తూర్పునే విశాలమైన ఒట్టొమాన్ సామ్రాజ్యం వుంది.  

ఒట్టొమాన్ సామ్రాజ్యం ఆధునిక టర్కీ దేశానికి పూర్వ రూపం అనుకోవచ్చు. అధికశాతం క్రిస్టియన్లు వున్న బాల్కన్ ప్రాంతానికి, ఇస్లామ్ ప్రధాన మతంగా గల ఒట్టొమాన్ సామ్రాజ్యానికి మధ్య కూడా అడపాదడపా  పచ్చగడ్డి భగ్గుమంటూ ఉండేది. అయితే బాల్కన్ ప్రాంతంలో ఎన్నో భాగాలు చాలా కాలంగా ఒట్టొమాన్ సామ్రాజ్యం కింద వుంటూ వస్తున్నాయి. బాల్కన్ జాతులలో వాళ్లలో వాళ్లకి ఎన్ని వైరాలు ఉన్నా, ఒట్టొమాన్ సామ్రాజ్యం విషయంలో మాత్రం అందరి మనోభావం ఒక్కలాగే ఉండేవి. బాల్కన్ ప్రజలు  ఎప్పుడూ ఒట్టొమాన్ పాలకులని పరాయి వాళ్లు  గానే చూశారు. 1870 నుండి బాల్కన్ ప్రాంతాలలో ఒట్టొమాన్ పాలకులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి

1914 నాటి బాల్కన్ రాజ్యాలని పై మ్యాపులో చూడొచ్చు. ఆస్ట్రియా-హంగరీ రాజ్యంలో సారయేవో నగరం కనిపిస్తోంది. రాజ్యానికి దక్షిణాన సెర్బియా మొదలైన బాల్కన్ రాజ్యాలు కనిపిస్తున్నాయి. బాల్కన్లకి దక్షిణాన ఒట్టొమాన్ సామ్రాజ్యాన్ని చూడొచ్చు.


ఇలా ఉండగా 1877 లో ప్రాంతంలో ముఖ్యమైన పరిణామం జరిగింది. ఒట్టొమాన్ సామ్రాజ్యానికి పొరుగునే రెండు అగ్రరాజ్యాలు ఉన్నాయి. ఉత్తర-తూర్పున రష్యా, ఉత్తర-పశ్చిమాన ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యం -  మధ్యలో పాపం ఒట్టొమాన్ సామ్రాజ్యం! పొరుగున ఉన్న రెండు అగ్రరాజ్యాలు శత్రు రాజ్యాలు. ఇది చాలనట్టు లోపల బాల్కన్ తమ్ముళ్ల తిరుగుబాటు ప్రయత్నాలతో ఒట్టొమాన్ సామ్రాజ్యంలో  పరిస్థితి కాస్త కీలకంగానే ఉండేది. ఇదే అదను అని రష్యా, ఆస్ట్రియా-హంగరీ లు చక్కని ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం రష్యాకి చెందిన అలెగ్జాండర్ – II  అనే ట్సార్ ఒట్టొమాన్ ని అటకాయించి దానిలో భాగమైన బెస్సరేబియాని తన రాజ్యంలో కలిపేసుకుంటాడు. అవతలి పక్క వున్న ఆస్ట్రియా-హంగరీ చూసీ చూడనట్టు ఊరుకోవాలి. అలాగే ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యం ఉత్తర-తూర్పు నుండి ముట్టడి చేసి బాస్నియా-హెర్జేగోవినా ని ఆక్రమించుకుని తన రాజ్యంలో కలిపేసుకోవచ్చు. రష్యా కిమ్మనకుండా ఊరుకుంటుంది. రెండు అగ్ర రాజ్యాలు అలాగే ఒట్టొమాన్ ని ఇరు పక్కల నుండి దాడి చేసి ఆయా ప్రాంతాలని తమ సొంతం చేసుకున్నారు.

అలా ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యంలో కలిసిపోయిన బాస్నియా-హెర్జెగోవినా మీద సెర్బియా ఎప్పటి నుండో కన్నేసింది. ఎందుకంటే రాజ్యం వేరైనా బాస్నియా-హెర్జెగోవినా లో 40% పైగా వున్నది సెర్బ్ జాతి వాళ్లే. కనుక ప్రాంతాన్ని ఎలాగైనా ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యం నుండి వెనక్కు తెచ్చుకోవాలని ఎంతో కాలంగా సెర్బియన్ ప్రజలకి  వుంది. కారణం చేత ఆస్ట్రియా-హంగరీ రాజులంటే ద్వేషం కూడా ఉండేది.

సెర్బియాలోమ్లాడా బాస్నాఅనే జాతీయ పార్టీ ఉండేది. 1914 లో జూన్ నెలలో ఆస్ట్రియా-హంగరీ కి కాబోయే రాజు ఫ్రాన్జ్ ఫెర్డినాండ్ సారయేవోని సందర్శిస్తున్నాడన్న వార్త వచ్చింది. సందర్భంలో ఫెర్డినాండ్ ని హత్య చెయ్యాలని పార్టీ సభ్యులు కొందరు పథకం వేశారు. గవ్రిలో ప్రిన్సిప్ తదితరులు పార్టీ సభ్యులే. వారి  ప్రయత్నం ఫలించింది. ఫ్రాన్స్ ఫెర్డినాండ్ మరణించాడు.

అయితే ఫ్రాన్జ్ ఫెర్డినాండ్  ని హత్య చేసింది సెర్బియాకి చెందిన విప్లవకారుల బృందం. సెర్బియా ప్రభుత్వానికి అందులో హస్తం లేదు. అటువంటి పరిస్థితిలో ఆస్ట్రియా-హంగరీ పాలకులు స్పందించడం అంటూ జరిగితే, ప్రతిక్రియ అంటూ చేస్తే,మ్లాడా బాస్నాసభ్యులని వెంటాడి దండించాలి. సమస్య అక్కడితో ఆగిపోవాలి. అలాంటిది ప్రపంచం నలు మూలల నుండి అగ్రరాజ్యాలు స్పందించి రణరంగ ప్రవేశం చెయ్యడమేమిటి

యూరప్ లో మారుమూల సారయేవో నగరంలో జరిగిన గొడవ అలా ప్రపంచం అంతటా ఎందుకు వ్యాపించింది?
(ఇంకా వుంది)