Themes from World History

Themes from World History

Monday, February 29, 2016

రష్యన్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన పీటర్ ద గ్రేట్







రష్యన్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన పీటర్ గ్రేట్
అది పదిహేడవ శతాబ్దం.
అప్పటికే పశ్చిమ యూరప్ లో సాంస్కృతిక పునరుద్ధరణ (renaissance) బాగా ఊపందుకుని యూరొపియన్ దేశాలలో కళ, సాహిత్య, వైజ్ణానిక రంగాలలో గొప్ప, సంచలనాత్మకమైన పరిణామాలు చేసుకుంటున్నాయి. కాని ఆ ప్రగతిశీల పరిమళాలు ఇంకా తూర్పు యూరప్ కి విస్తరించలేదు. 

తూర్పు యూరప్ కి చెందిన ఓ రాజ్యం రష్యా. యూరప్ అలా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే తన రాజ్యం అలా వెనకబడి ఉండం రష్యాని ఏలిన ఒక రాజుకి నచ్చలేదు. (రష్యన్  రాజులని  ట్సార్ లు అనేవారు).  రాచకుటుంబాల గుప్పెట్లో నలుగుతూ, పాత సాంప్రదాయ నిబద్ధమైన విధానలతో కుంటినడక నడుస్తున్న రష్యన్ జీవన విధానాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాన్ని తలపెట్టాడు పీటర్. విద్యాలయాలలో మత బోధ మోతాదు తగ్గించి ఆధునిక వైజ్ఞానిక విషయాలని ప్రవేశపెట్టించాడు. పాలనలో చర్చి హుకుం ని బలహీనపరిచి, ఆధునిక పాశ్చాత్య పద్ధతిలో పని చేసే పాలనా వ్యవస్థని స్థాపించాడు. శక్తివంతమైన నౌకా దళానికి రూపం పోశాడు. ఎన్నో యుద్ధాలు చేసి, గెలిచి రాజ్యాన్ని విపరీతంగా విస్తరింపజేశాడు. ఓ అవిశేష రాజ్యంగా వున్న రష్యాని గొప్ప ప్రభావం, ప్రాబల్యం గల విశాల రష్యన్ సామ్రాజ్యం స్థాయికి తెచ్చాడు. ఒక్కడూ అన్ని చేసినవాడు గనక, అతి తక్కువ కాలంలో గొప్ప లోదృష్టితో, వినూత్న సంస్కరణలతో, రష్యన్ జాతిని ఆర్థికంగా, రాజకీయంగా, వైజ్ఞానికంగా, సాంస్కృతికంగా ఎంతో ఎత్తుకు తీసుకుపోగలిగాడు కనుక అతణ్ణి మహానుభావుడని, ‘పీటర్ గ్రేట్అని పిలుస్తారు.

ఒక కొత్త రాజవంశానికి మూలపురుషుడు కనుక పీటర్ని ఒకటవ పీటర్ అంటారు. రష్యాలో కొంత భాగం తూర్పు యూరప్ లోను, తక్కిన భాగం ఆసియా ఖండంలోను ఉంటుందని మనకు తెలుసు. ఈ ఒకటవ పీటర్ పాలించిన భాగం తూర్పు యూరప్ లో వుంది. యూరప్ లో వున్న రష్యన్ భాగం భారత దేశానికి రెండింతల విస్తీర్ణత గల విశాల భూభాగం. తూర్పులో ఉరల్ పర్వతాలు, పడమరలో కార్పాతియన్ పర్వతాలు, ఉత్తరాన బాల్టిక్ సముద్రం, దక్షిణాన బ్లాక్ సముద్రం ప్రాంతానికి సహజ సరిహద్దులుగా ఉన్నాయి. ఇక మధ్యలో ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తూ పర్వత శ్రేణులు మొదలైన భౌగోళిక అవరోధాలేమీ లేవు. ఇది కాక ప్రాంతం అంతా సజహ రాదారుల్లా  పని చెయ్యగల గోదారులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సామ్రాజ్య స్థాపనకి కావలసిన భౌగోళిక లక్షణాలెన్నో ప్రాంతానికి వున్నాయి.

 

అయితే ప్రాంతం ఎంతో కాలంగా పారిశ్రామికంగా వెనుకబడి ఉండడానికి కూడా భౌగోళిక లక్షణాలే కారణాలు. అతి తీవ్రమైన శీతాకాలాలు అక్కడ పారిశ్రామిక పురోగతికి అనుకూలించలేదు. కాని అక్కడి నేల సారవంతమైన నల్లరేగడి భూమి కావడంతో అక్కడి ప్రజలు అధికశాతం సేద్యం మీద ఆధారపడి బతికేవారు. ఇంచుమించు అపరిమితమైన నేల సంపద ఉండడంతో ఒక ప్రాంతంలో జన సమ్మర్దం పెరిగితే అక్కడి నుండి కొంత మంది వేరుపడి మరో చోట నివాసాలు ఏర్పరచుకునేవారు. వాతావరణం వెచ్చగా, సానుకూలంగా ఉన్నంత కాలం పంటలు పండించుకుని పొట్టపోసుకోవడం, చలి తీవ్రత పెరిగిన కాలంలో వెచ్చగా ఇంటిపట్టున నిమ్మళంగా కూర్చోడంఇదీ వారి జీవన సరళి.

ప్రస్తుతం మన రష్యన్లు అని పిలిచే జాతిలో ఎన్నో ఇతర జాతుల రక్తం మిళితమై వుంది. సుదీర్ఘమైన చరిత్ర గల జాతిలోనైనా ఇలాంటి మిశ్రమం సహజంగా జరుగుతుంది. రష్యన్ జాతికి మూలాంకురాలు కార్పాతియన్ పర్వతాలకి ఉత్తర, తూర్పు ప్రాంతాలలో జీవించిన తెగలు అని  చెప్పుకోవచ్చు. రూపురేఖల్లో, వేషభాషల్లో, ఆచారవ్యవహారాలలో రష్యన్లకి, పోలండ్, చెకొస్లవాకియా, యుగొస్లావియా మొదలైన దేశాలకి చెందిన ప్రజలకి మధ్య ఎంతో సాన్నిహిత్యం వుంది. అందుకే దేశాలకి చెందిన ప్రజలందరూ ఒక జాతికి చెందిన వారిగా వర్ణిస్తారు. జాతిని స్లావ్ (Slav) జాతి అంటారు.

కార్పాతియన్ పర్వత ప్రాంతంలో తమ జీవయాత్ర ప్రారంభించిన తెగల వారు పెద్దగా జనావాసం లేని విశాల భూభాగం మీదుగా తూర్పు దిశగా చొచ్చుకుపోయారు. అడవుల్లో చెట్లు పడగొట్టి పల్లెలు నిర్మించుకున్నారు. నదీ తీరాల మీద ఊళ్లు కట్టుకున్నారు. నదీలోయల వెంట ఇంకా ఇంకా ముందుకు దూసుకుపోతూ కొత్త నెలవులు ఏర్పరచుకున్నారు. తారసపడ్డ కొత్త తెగలతో సంబంధాలు కలుపుకున్నారు. బలిమి చేతగాని, చెలిమి చేతగాని తమలో కలుపుకున్నారు. విధంగా ఉత్తరంలో ఫిన్లాండ్ కి చెందిన ఎందరోఫిన్’ (Finn)  జాతి వారు రష్యన్ తెగలతో కలిశారు. అలాగే దక్షిణంలో టర్కుల రక్తం కూడా కలిసింది. అదే విధంగా రష్యాని ఏలిన మొట్టమొదటి రాజులు కూడా నిజానికి రష్యాకి చెందిన వాళ్లు కారు. వెయ్యేళ్ల క్రితం రష్యాని పాలించిన రాజులు, రాకుమారులు ఉత్తర యూరప్ లోని స్కాండినావియా నుండి వచ్చినవాళ్లు.
(ఇంకా వుంది)