Themes from World History

Themes from World History

Sunday, April 24, 2016

పీటర్ గౌరవార్థం నిర్మించబడ్డ సెయింట్ పీటర్స్ బర్గ్



ఒక పక్క పీటర్ యూరప్ నుండి ఎన్నో ప్రగతిశీల విధానాలని రష్యన్ జీవన విధానంలోకి ప్రవేశపెడుతున్నా తన పాలనా వైఖరిలో మాత్రం ధర్మబద్ధుడైన రాజులా కాక, వ్యతిరేకతని ఉక్కుపాదంతో అణచిపెట్టే నియంత లాగానే వ్యవహరించసాగాడు. యూరొపియన్ రాజ్యాలలో సామాన్యంగా భూస్వాములకి మంచి పరపతి, ప్రాభవం ఉండేది. వీళ్లు మామూలు పరిస్థితుల్లో ఇంచుమించి స్వతంత్రులుగా వ్యవహరిస్తూ యుద్ధం వచ్చినప్పుడు తగు రీతిలో తమ రాజుకి  సహాయం చేసేవారు. భూస్వాముల ప్రాభవం అలాగే ఉంటే అది తన సింహాసనానికే ముప్పు అని గ్రహించాడు పీటర్. భూస్వాముల రాజకీయ బలాన్ని అణిచేలా చట్టబద్ధమైన మార్పులు తెచ్చాడు. అలాగని భూస్వాముల వర్గాన్ని పూర్తిగా నాశనం చెయ్యలేదు. భూస్వాముల సంతతి వారు వారిని నచ్చితే సైనిక దళంలో గాని, నౌకా దళంలో గాని, పాలనా కార్యాలయాలలో గాని అధికారులుగా పని చెసే అవకాశం ఇచ్చాడు

రోజుల్లో రష్యన్ చర్చికి రాజుగాలి సత్తాతో తులతూగేటంత ప్రాభవం ఉండేది. బలాన్ని కూడా అణచివేయాలని నిశ్చయించాడు పీటర్. చర్చికి సాంప్రదాయకంగా వచ్చే హక్కులు రద్దు చేసి దాని స్థానంలోహోలీ సైనోడ్అనే పేరు గల ఒక సదస్సుని స్థాపించాడు. అయితే సదస్సులోని సభ్యులు అంతా రాజుగారికి అయిన వారే, రాజుగారు ప్రత్యేక శ్రద్ధతో ఎంపిక చేసినవారే. ఆనాటి నుండీ రష్యన్ చర్చి కూడా రాజుగారికి, రష్యన్ ట్సార్ కి దాసోహం అయిపోయింది.
సింహాసానాన్ని సంరక్షించుకోవడం కోసం ఒక వర్గం యొక్క బలాన్ని నియంత్రించడం వేరు. ఒక వర్గాన్ని సమూలంగా నాశనం చెయ్యడం వేరు. రష్యన్ రైతులతో వ్యవహరించే తీరులో మాత్రం పీటర్ కేవలం ఒక నియంతలా కాక ఒక కిరాతకుడిలా వ్యవహరించాడు. రైతుల మీద, బడుగు వర్గాల మీద పన్నుల భారం విపరీతంగా పెంచాడు. పీటర్ ఏలికలో ప్రభుత్వ ఖర్చులు 600% పెరిగాయి. ఖర్చులో చాలా మటుకు సైనిక, నౌకా దళానికి సంబంధించిన ఖర్చులే. దేశంలోనైనా మామూలుగానే రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పీటర్ వంటి నిరంకుశుడి ఏలికలో రైతుల పరిస్థితి మరింత వేగంగా దిగజారింది.

 పేదరికం బాధకి తట్టుకోలేక క్రమంగా రైతులు బానిసలుగా మారసాగారు. రైతులు బానిసలుగా మారే ఒరవడి అప్పటికే ఒక శతాబ్ద కాలంగా వస్తోంది. పీటర్ కిరాతక విధానాల వల్ల అది మరింత వేగవంతం అయ్యింది. పందొమ్మిదవ శతాబ్దంలో అమెరికాలో చలామణి అయిన బానిసత్వానికి దీనికి పెద్దగా తేడా లేకపోయింది. యజమానుల అనుమతి లేకుండా బానిసలు వారి భూముల సరిహద్దులు దాటి పోడానికి లేదు. యజమాని పని ఇచ్చినా కిక్కురుమనకుండా చెయ్యాల్సిందే. యజమానులు వారిని సంతలో గొడ్లలా కొంటూ, అమ్ముతూ ఉండేవారు. పని పొరబాటు జరిగితే యజమానులు వారినిక్నౌట్అనే ఒక ప్రత్యేక కొరడాతో చితకబాదేవారు. విద్యారాహిత్యం, అజ్ఞానం, నిరంకుశపాలన -  మూడిటి మిశ్రమం వల్ల పీటర్ కాలంలో రైతుల జీవితం అధోగతి పాలయ్యింది.

నిరంకుశంగా వ్యవహరించినా రష్యాని సైనికంగా ఎంతో బలపరిచాడు పీటర్. ప్రవర్ధమానమైన సైనిక బలంతో రాజ్యాన్ని మరింత విస్తరింపజేశాడు. ముఖ్యంగా రాజ్యం ఆర్థికంగా ఎదగాలంటే సముద్ర వాణిజ్య మార్గాలని వశం చేసుకోవాలని పీటర్ ముందే గ్రహించాడు. (ఈ సంగతి లోగడ ప్రస్తావించడం జరిగింది.) సుసంపన్నమైన యూరప్ తో వాణిజ్యరంగంలో సత్సంబంధాలు కల్పించుకోవాలంటే బాల్టిక్ సముద్రం లోకి, నల్ల సముద్రంలోకి ప్రవేశ మార్గాలు అందుబాటులో ఉండాలి. రష్యాకి అంతకు ముందు అందుబాటులో ఉన్న సముద్రాలు – కాస్పియన్ సముద్రం, తెల్ల సముద్రం (White sea). కాస్పియన్ సముద్రం భూదిగ్బంధమైన సముద్రం. దాని వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. అలాగే తెల్ల సముద్రం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే తెల్ల సముద్రం ఏడాదిలో అధిక భాగం మంచుతో కప్పబడి వుంటుంది.

బాల్టిక్ సముద్రం చుట్టు పక్కల ఉండే ప్రాంతాలన్నీ ఆ రోజుల్లో స్వీడిష్ హయాంలో ఉండేవి. ఆ రోజుల్లో యూరప్ లో అత్యంత శక్తివంతమైన రాజ్యాల్లో స్వీడెన్ ఒకటి. అప్పటికే పీటర్ రాజు టర్కీ మీద యుద్ధం చేసి అఝోవ్ ప్రాంతాన్ని గెలిచాడు. ఇక స్వీడెన్ మీద విజయం మాత్రమే మిగిలింది. స్వీడెన్ మీద విజయం కోసం పీటర్ పొరుగు రాజులతో పొత్తులు కుదుర్చుకోవడానికి ప్రయత్నించాడు. వారిలో ఒకడు సాక్సనీ, పోలండ్ ప్రాంతాలని ఏలే ఆగస్టస్ -2 ఒకడు. రెండవ వాడి డెన్మార్క్ రాజు. ముగ్గురు ఏలికలూ కలిసి స్వీడెన్ మీదకి దండయాత్ర చెయ్యాలని నిర్ణయించుకుని, కొల్లగొట్టిన ప్రాంతాలని ఎలా పంచుకోవాలో ముందే ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఇలా ఉండగా 1697 లో స్వీడెన్ రాజు అకస్మాత్తుగా చనిపోవడం రష్యాకి కలిసొచ్చింది. పదిహేనేళ్ల పిల్లవాడైన రాకుమారుడు చార్లెస్ 12 సింహాసనాన్ని అధిష్టించాడు. వయసులో చిన్నవాడే గాని 12 వ చార్లెస్ పిరికివాడేం కాడు. ముగ్గురు శత్రు రాజులు దండెత్తే లోపు తానే మొదటి అడుగు వేశాడు. 1699 లో తానే స్వయంగా సైన్యాన్ని వెనకేసుకుని డేనిష్ రాజధాని అయిన కోపెన్ హాగెన్ మీదకి దండెత్తాడు. ఆ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన   డేనిష్ రాజు స్వీడిష్ యువరాజుకి లొంగిపోయాడు. 

దాంతో ఉత్సాహం హెచ్చిన స్వీడిష్ రాకుమారుడు 50,000 సైన్యంతో రష్యన్ భూభాగం లోకి లోతుగా చొచ్చుకుపోయాడు. అక్కడ తన సేనలకి చాలా కఠినమైన వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయి. అంతేలేనట్టు ఉండే హిమావృతమైన విశాల రష్యన్ భూముల మీద స్వీడిష్ సేనలు గడగడ వణికాయి. ఆకలికి, చలికి తట్టుకోలేని సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు వదిలారు. చివరికి దక్షిణ రష్యాలో పాల్టావా అనే ప్రాంతంలో చార్లెస్-2 కి చెందిన సైన్యం పీటర్ రాజు సైన్యంతో తలపడింది. స్వీడిష్ సైన్యం ఎంత వీరోచితంగా పోరాడినా పీటర్ సైన్యం యొక్క సంఖ్యా బలం ముందు తలవంచక తప్పలేదు. యుద్ధంలో తన సేనలు లొంగిపోతున్నాయని తెలిసిన చార్లెస్-2 యుద్ధం నుండి పలాయనం అయ్యాడు. కాని కొంత కాలం తరువాత నార్వేలో జరిగిన మరో యుద్ధంలో చార్లెస్-2 ప్రాణాలు కోల్పోయాడు.

స్వీడెన్ నుండి హస్తగతం చేసుకున్న భూములలో ఒక ప్రాంతంలో నేవా నదీ తీరం మీద పీటర్ రాజు ఓ గొప్ప నగరాన్ని స్థాపించాలని సంకల్పించాడు. యూరప్ నుండి పుణికి పుచ్చుకున్న కొత్త సంస్కృతికి, చదువుకి ఆ నగరం  విరాజమాన చిహ్నం కావాలి. ఎదుగుతున్న రష్యన్ ప్రాభవానికి, రాజ్య వైభవానికి ఆ ఊరు ప్రతీక కావాలి. తన స్వరాజ్యాన్ని ఉద్ధరించడంలో పీటర్ సాధించిన విజయాలకి అది స్మారక చిహ్నం కావాలి. రష్యన్ జాతిలో, జీవన గతిలో వచ్చిన ఓ అద్భుత పరిణామానికి ఆ పట్టణం మూర్తి రూపం కావాలి. గొప్ప వ్యయంతో, వేలాది మంది శిల్పుల, సాంకేతిక నిపుణుల, కళాకారుల, శ్రమ ఫలితంగా అలాంటి నగరం ఒకటి రూపం పోసుకుంది. దానికి సెయింట్ పీటర్స్ బర్గ్ అని పేరు పెట్టారు. తరువాత ఆ పేరు పెట్రోగ్రాడ్ గా మారింది. కమ్యూనిస్టుల కాలంలో దానికి లెనిన్ గ్రాడ్ అని కూడా పేరు మార్చారు. ఇటీవల 1991లో మళ్లీ దాని పూర్వపు నామం అయిన సెయింట్ పీటర్స్ బర్గ్ అన్న పేరే పెట్టారు.
 
నేటి సెయింట్ పీటర్స్ బర్గ్
 
ఆ విధంగా స్వీడెన్ తో సుదీర్ఘమైన తగవుకి పర్యవసానంగా పీటర్ రాజు కల నిజమయ్యింది. బాల్టిక్ సముద్రంలోని తూర్పు తీరం మీద అధిక శాతం రష్యన్ రాజ్యంలోకి వచ్చింది. యూరప్ తో వాణిజ్య రంగంలో సత్సంబధాలు కుదిరాయి. క్రమంగా రష్యా ఒక సుసంపన్నమైన రాజ్యంగా ఎదిగింది. 1721 లో అక్టోబర్ 22 నాడు రష్యన్ “పితృభూమికి పితరుడిగా, రష్యన్ సామ్రాజ్యానికి సామ్రాట్టుగా, పీటర్ ద గ్రేట్” గా తనని తానే ప్రకటించుకున్నాడు.

Reference:
C.J.H. Hayes and P.T. Moon, Modern History, Macmillan Company, 1941.




No comments:

Post a Comment