రోమన్ సెనేట్ ఒక సామ్రాట్టుని,
ఒక నియంత ని (dictator) ఎన్నుకోవడానికి సిద్ధమయ్యింది. నిస్వార్థ సేవాతత్పరుడు అని
పేరు పొందిన సిన్సినాటస్ ని ఆరు నెలల పాటు నియంతగా పని చెయ్యమని ఎన్నుకున్నారు. దేశాన్ని
ప్రస్తుత విపత్కర పరిస్థితులనుండి బయటికి ఈడ్చి, గండం గట్టెక్కించడం అతడు సాధించవలసిన
కార్యం.
సిన్సినాటస్ వెంటనే కార్యాచరణలోకి
దిగాడు. అంతో ఇంతో ఆరోగ్యం గల ప్రతీ రోమన్ యువకుణ్ణి రోజు తిరిగేలోగా సైనిక దళంలో చేరమని
ఆజ్ఞ జారీ చేశాడు. మర్నాడే తన యువసేనతో ఎక్వీ సైన్యాన్ని రెండు పక్కల నుండి ఒకే సమయంలో
ముట్టడించాడు. శత్రు సేనలని ఊచకోత కోయకుండా వారికి రెండు పక్కలా శూలాల వంటి రాటలతో
తాత్కాలిక ప్రహరీ గోడ వంటిది నిర్మించి ఆ గోడల వద్ద శత్రు సేనని నిర్బంధించాడు. ఇక
విముక్తి మార్గం కనిపించక శత్రువులు లొంగిపోయారు. ముఖ్యమైన సేనానులని మాత్రం పట్టి
ఉరి తీయించి, సిపాయిలని మాత్రం వదిలిపెట్టాడు.
నాగలి వదిలి రోమ్ పగ్గాలు అందుకోడానికి సిద్ధమవుతున్న సిన్సినాటస్ (1806 నాటి తైలవర్ణ చిత్రం, చిత్రకారుడు యువాన్ ఆంటోనియో రిబేరా)
ఆ విధంగా రోమ్ కి పట్టిన గండాన్ని
పదిహేను రోజుల్లోపే తొలగించాడు సిన్సినాటస్. పదవీ వ్యామోహం కొద్దీ తన సింహాసనానికి అంటిపెట్టుకు
కూర్చోకుండా వెంటనే పదవీ విరమణ చేసి, మళ్లీ తన పల్లెకి తరలి ఎప్పట్లాగే సేద్యం చేసుకుంటూ
జీవనం కొనసాగించాడు. పేరుకి నియంత అయినా దేశానికి సేవకుడిలాగే నడచుకున్నాడు. శౌర్యం,
క్రమశిక్షణ, ఆత్మసమర్పణ అనే రోమన్ సైనిక విలువలకి నిదర్శనంగా నిలిచి రోమన్ చరిత్రలో
చరిత్రలో చిరకీర్తిని సాధించాడు.
ఆసక్తికరమైన సమాచారం ఇస్తున్నారు చక్రవర్తి గారూ.
ReplyDeleteఅమెరికాలో సిన్సినాటి అనే ఒక ప్రధాన నగరం ఉంది (ఒహైయో రాష్ట్రంలో). బహుశః ఈ రోమన్ నియంత పేరే పెట్టారేమో ఆ ఊరికి?
అవును నరసింహా రావు గారు. మొదట సిన్సినాటస్ గురించి చదివినప్పుడు నా మనసులో మెదిలిన ఆలోచన కూడా అదే!
ReplyDelete