ఆ విధంగా ఆరంభంలో రష్యా
మీద
పశ్చిమ యూరప్ యొక్క ప్రభావం బలంగా వున్నా,
తదనంతరం
దాని వికాస క్రమంలో ఆ ప్రభావం
బలహీన
పడుతూ వచ్చింది. పదవ శతాబ్దంలో కీవ్ నగరానికి కి చెందిన వ్లాడిమిర్ రష్యాకి రాజు అయ్యాడు. ఇతడు వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించడమే కాక తన రాజ్యంలో పౌరులని కూడా
ఆ
మతాన్ని స్వీకరించమని ప్రోత్సహించాడు. అయితే అతడు స్వీకరించిన క్రైస్తవ మత శాఖకి వేళ్లు కాథొలిక్ చర్చి వున్న రోమ్
లో
లేవు. కాంస్టాంటినోపుల్
కి
చెందిన “సాంప్రదాయక గ్రీక్ చర్చి” (Orthodox Greek church) లో వున్నాయి.
ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. పశ్చిమ రోమన్ సామ్రాజ్యానికి రాజధాని రోమ్ అయితే, తూర్పు రోమన్ సామ్రాజ్యానికి కాంస్టాంటినోపుల్ రాజధానిగా ఉండేది. ఈ కాంస్టాంటినోపుల్ యే నేటి టర్కీ దేశంలో వున్న చారిత్రాత్మక ఇస్తాన్బుల్ నగరం.
ఈ
తూర్పు రోమన్ సామ్రాజ్యానికే బైజాంటైన్ సామ్రాజ్యం (Byzantine
empire) అని కూడా పేరు వుంది. కాంస్టాంటినోపుల్ కి చెందిన క్రైస్తవ శాఖను స్వీకరించిన రష్యా ఆ ప్రాంతానికి చెందిన సంస్కృతిని, కళని వారసత్వంగా స్వీకరించింది. అలాగే భాష విషయంలో కూడా పశ్చిమ యూరప్ కి చెందిన దేశాలు అన్నీ తమ తమ భాషలని వ్యక్తం చేసుకోడానికి లాటిన్ లిపిని స్వీకరించాయి గాని, రష్యా మాత్రం ప్రాచీన గ్రీకు లిపి మీద ఆధారపడ్డ ఓ కొత్త లిపిని స్వీకరించింది. ఆ లిపినే ప్రస్తుతం మనం సిరిలిక్ లిపి అంటారు. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన సిరిల్, మరియు మెథోడియస్ అనే ఇద్దరు క్రైస్తవ సాధువుల గౌరవార్థం ఆ లిపికి అలా పేరు పెట్టారు.
సిరిలిక్ లిపి
రష్యా మీద యూరప్
ప్రభావం బలహీనంగా
ఉండడానికి భౌగోళిక
కారణాలే కాక కొన్ని బలమైన రాజకీయ కారణాలు కూడా వున్నాయి. ఉరల్ పర్వతాలకి, కాస్పియన్ పర్వతాలకి మధ్య ఉండే ఓ ప్రాంతం ఏషియాని యూరప్ తో కలిపే ఓ సహజ ముఖ ద్వారంగా చెప్పుకోవచ్చు. పదమూడవ శతాబ్దం తొలి దశల నుండి కూడా ఏషియా కి చెందిన ఎన్నో కిరాత తెగలు యూరప్ లోకి చొచ్చుకొచ్చి అక్కడి ప్రాంతాలని ఆక్రమించి
భీభత్సం
సృష్టించిన సందర్భాలు
ఎన్నో
ఉన్నాయి. అలా రష్యాని అటకాయించి ఆక్రమించిన జాతులలో ఏషియాకి చెందిన మాగోల్ (Mongols) జాతి ఒకటి. వీరినే టాటార్ (Tatars)లు అని కూడా అంటారు.
13,
14 శతాబ్దాలలో మహర్దశకి చేరిన మాంగోల్ సామ్రాజ్యం మనకి తెలిసిన చరిత్రలో అత్యంత విస్తారమైన ‘ఏకీకృత’ భూభాగం గల సామ్రాజ్యం.
(బ్రిటిష్
సామ్రాజ్యం యొక్క విస్తీర్ణత మాంగోల్ సామ్రాజ్యం కన్నా కాస్త ఎక్కువే. అయితే బ్రిటిష్ సామ్రాజ్య భాగాలు పలు ఖండాలలో సముద్రాల చేత వేరు చెయ్యబడి వున్నాయి. కాని మాంగోల్ సామ్రాజ్యం లో భాగాలన్నీ అవిచ్ఛిన్న భూమిలోని భాగాలు.) తూర్పులో జపనీస్ సముద్రం నుండి, పశ్చిమంలో యూరప్లోని తూర్పు ప్రాంతాల వరకు విస్తరించిన బృహత్ సామ్రాజ్యం అది. మాంగోలియాలో దేశదిమ్మరి తెగలుగా వున్న పలు తెగలని ఏకీకరించి, వారిని ఓ అప్రహతిహత యుద్ధ యంత్రంగా, ఓ సంఘటిత శక్తిగా తీర్చి దిద్ది, మాంగోల్ రాజైన చెంగిజ్ ఖాన్ ఓ విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
చెంగిజ్ ఖాన్ ఏలిన విశాల మాంగోల్ సామ్రాజ్యం
అయితే ఈ మాంగోల్ లు మితిమీరిన బలోద్ధతి గల వారేగాని నాగరిక వాసనలు పెద్దగా లేని ఆటవిక జాతులు. వీరు ఆక్రమించిన ప్రాంతాలని నిర్దాక్షిణ్యంగా కాలరాసేవాళ్లు. ఆడ మగ అని కూడా చూడకుండా అడ్డొచ్చిన వారిని ఊచకోత కోసేవాళ్లు. 250 ఏళ్ల పాటు రష్యన్లు ఈ అనాగరకుల గుప్పెట్లో నలిగారు. దీర్ఘకాలం అలాంటి అనాగరక పాలకుల ఏలికలో బతకడం వల్ల రష్యన్ ట్సార్ లు కూడా కొద్దోగొప్పో వాళ్ల మోటు పద్ధతులని అలవాటు చేసుకున్నారు. తమ ప్రజలని కిరాతకంగా అణిచి పెట్టి పాలించే విధానాలు అవలంబించారు. పీటర్ ద గ్రేట్
ప్రవేశపెట్టిన సంస్కరణల
వల్ల రాచవర్గం నియంతల్లా ప్రజలని పీడించే విధానం బలహీనపడింది. యూరప్ లో జరుగుతున్న సాంస్కృతిక పునరుద్ధరణ
పరిమళాలు
మొట్టమొదటి సారిగా రష్యన్ సమాజం మీద ప్రభావం చూపించడం మొదలయ్యింది.
ఇలా ఉండగా ఒక దశలో
మాంగోల్
ల అధిపత్యం నుండి బయటపడడానికి అనువైన మార్పులు చోటుచేసుకున్నాయి. రష్యాలో ముస్కొవీ అనే ఓ ఊరు, లేదా దాని పరిసర ప్రాంతాలు ఆ మార్పునకు కేంద్ర స్థానం అయ్యింది.
మాంగోల్ ల అధిపత్యంలో ఉన్న రష్యన్ రాజ్యంలో ఎన్నో రాష్ట్రాలు ఉండేవి. వాటిలో ముస్కొవీ అనే రాష్ట్రం కూడా వుంది. మాస్కోవ్ అనే ఊరు ముఖ్య పట్టణంగా గల రాష్ట్రం కనుక దానికలా పేరొచ్చింది. తూర్పు యూరప్ లో ఉత్తర-దక్షిణం గాను, తూర్పు-పడమర గాను విస్తరించిన కొన్ని ప్రధాన రాదార్ల మీద వుందీ మాస్కోవ్ నగరం. ఆ కారణం చేత మాస్కోవ్ నగరం వాణిజ్యం బాగా వర్ధిల్లింది. నగరంతో పాటు అది వున్న రాష్ట్రం కూడా రష్యన్ రాజ్యానికి తలమానికంలా వర్ధిల్లింది. ముస్కొవీ నుండి మాంగోల్ చక్రవర్తులకి అందే కప్పం కూడా గణనీయంగా ఉండేది.
ముస్కొవీని ఏలే రష్యన్ సామంత రాజులు కూడా తమ మాంగోల్ అధిపతులతో సత్సంబంధాలు పెట్టుకుని నడచుకునేవారు. సకాలంలో బుద్ధిగా కప్పం చెల్లించే ముస్కొవీ రాజుల మీద మాంగోల్ అధిపతుల కృపాకటాక్షాలు నిండుగా వుండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ముస్కొవీ క్రమంగా గొప్ప ప్రాబల్యం గల ప్రాంతంగా ఎదిగింది. క్రమంగా ముస్కొవీ రాజుల ఆత్మవిశ్వాసం పెరిగింది. సాంస్కృతికంగా, ఆర్థికంగా. రాజకీయంగా
తమని కట్టిపడేసిన మాంగోల్
సామ్రాజ్యపు
సంకెళ్లని విసిరికొట్టే అదను కోసం ఎదురుచూస్తూ వున్నారు.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment