Themes from World History

Themes from World History

Friday, March 11, 2016

అరివీర ‘భయంకరుడు’ – ఇవాన్



ఇలా ఉండగా పదిహేనవ శతాబ్దం చివరి దశలో రష్యా పరిసర ప్రాంతాలలో రాజకీయ రూపురేఖలు గణనీయంగా మారాయి. ఆ ప్రాంతంలో మాంగోల్ ల ప్రాభవానికి తెర పడింది. ఆధునిక టర్కీ ఉన్న ప్రాంతంలో ఆ రోజుల్లో ఒటోమన్లు  అనే టర్కిష్ జాతి పాలకులు రాజ్యం చేసేవారు. 1299 లో  అనటోలియా (ఇది ఆధునిక టర్కీలో ఒక భాగం) అనే ప్రాంతంలో ఒటోమన్ రాజ్యం ఊపిరి పోసుకుంది. ఆ రాజ్యాన్ని స్థాపించిన వారు ఓగుజ్ టర్కులు (Oguz Turks). ఆ తరువాత ఒకటవ మురాద్ (Murad I) తలపెట్టిన జైత్రయాత్రలో ఆ రాజ్యం మరింతగా విస్తరించింది. 1453 లో ఒటోమన్ రాజైన మెహ్మెద్ (Mehmed the Conqueror)  కాంస్తాంటినోపుల్ మీద దండెత్తి మాంగోల్ రాజుని తొలగించాడు. దాంతో మాంగోల్ సామ్రాజ్యం అంతరించిపోయింది. 16 వ శతాబ్దాని కల్లా ఒటోమన్ సామ్రాజ్య ప్రాభవం బాగా పెరిగింది. దక్షిణ తూర్పు యూరప్, పశ్చిమ ఏషియా, ఉత్తర ఆఫ్రికా – ఒక విధంగా చెప్పాలంటే మధ్యధరా సముద్రానికి ఉత్తర, తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలన్నీ – ఒటోమాన్ సామ్రాజ్యం కిందకి వచ్చాయి.

 



ఒటోమన్ సామ్రాజ్యపు రూపురేఖలు





మస్కొవీ రాజులకి ఇప్పుడు పాత శత్రువు పోయి కొత్త శత్రువు దాపురించాడు. తమ రాజ్యం వర్ధిల్లాలంటే, విస్తరించాలంటే ఈ కొత్త శత్రువులో ఎప్పుడో అప్పుడు తలపడక తప్పదు.



పదహారవ శతాబ్దంలో మస్కొవీ రాజులలో కొత్త చైతన్యం వచ్చింది. వారిలో ఇవాన్ అనే వాడు తన పూర్వీకులలా కేవలం స్వేచ్ఛ కోసం కలలు గంటూ కూర్చోలేదు. ఒటోమన్  మీద తిరగబడి వారి హయాంలో వున్న ఇరుగు పొరుగు ప్రాంతాలైన అస్త్రాఖాన్, కజాన్ మొదలైనఖానేట్లని ఆక్రమించుకున్నాడుమాంగోల్ చక్రవర్తుల హయాంలో ఉన్న ప్రాంతాలని ఖానేట్లు అనేవారు విధంగా వోల్గా నదికి చెందిన పరీవాహక ప్రాంతంలో (Volga river basin)  మధ్య, దిగువ ప్రాంతాలు ఇవాన్ హస్తగతం అయ్యాయి. విధంగా అతిభయంకరులైన ఒటోమాన్ చక్రవర్తులకి ఎదురు తిరిగి వారి భూములని తిరిగి సాధించిన తెగువ గల వాడు కనుకనే ఇవాన్ రాజుకిభయంకరుడు’ (Ivan the Terrible) అనే బిరుదు సార్ధకం అయ్యింది.




 


అరివీర ‘భయంకరుడు’ – ఇవాన్



ఇవాన్ రాజుకి తన జైత్రయాత్రలలో ఎంతో సహాయపడ్డ వర్గం వారు ఒకరు ఉన్నారు. వాళ్లని కొసాక్స్ (Cossacks)  అంటారు. వీళ్లు ప్రత్యేకంగా యోధులతో కూడుకున్న తెగ. పోరాటం వారి రక్తంలో వుంది. శౌర్యం వారి ఇంటి పేరు. కొసాక్ అనే పదంకజాక్’ (Kazak)  అనే టర్కిష్ పదం నుండి వచ్చింది. పదానికిస్వతంత్రుడులేదాసాహసిఅని అర్థం. ఇలాంటి యోధుల సమితి ఒకటి జపాన్ లో కూడా ఉందని వింటాం. వారిని సమురాయ్ లు అంటారు. అయితే సమూరాయ్ లు స్వామిభక్తికి పెట్టింది పేరు. వీరికి భిన్నంగా కొసాక్ లు గాఢమైన స్వేచ్చాకాముకులు. వారు రాజుకి తల ఒగ్గరు. అయితే వాళ్లు రాజుల పక్షంలో పోరాడి వారి కోసం యుద్ధాలు గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాని వీలైనంత వరకు కొసాక్ లు రాచవర్గం యొక్క మోచేతి నీళ్లు తాగకుండా స్వతంత్రంగా జీవించడానికి  ఇష్టపడతారు. పైగా ఎన్నో సార్లు సంఘం బహిష్కరించిన వాళ్లు, నిందితులుగా సంఘం చేత ముద్ర వేయబడ్డ వారు నాగరిక సమాజం నుండి పారిపోయి కొసాక్ లలో చేరిపోవడం జరుగుతుంది.   రాజుకైనా వీళ్లు సహాయం అందజేస్తే ఇక రాజుకి యుద్ధంలో విజయం థ్యమనే చెప్పాలి. మరి కొసాక్లు దారుణ మారణ యుద్ధ యంత్రాలు.


 



కొసాక్ యోధుడు





కొసాక్ల సహాయంతో ఇవాన్ రాజు తన రాజ్యాన్ని తూర్పు దిశగా ఉరల్ పర్వతాల అవతలి వరకు విస్తరింపజేశాడు. సైబీరియా కూడా చివరికి ఇవాన్ కి పాదాక్రాంతం అయ్యింది. పదిహేడవ శతాబ్దం చివరి కల్లా పసిఫిక్ మహాసముద్ర తీరం మీద ఉన్న కంచట్కా ద్వీపకల్పం (Kamchatka peninsula) వరకు విస్తరించింది. ఇక పడమటి పక్కన ఇవాన్ రాజ్యం  పోలాండ్ లో కూడా కొంత భాగం తనలో కలుపుకుంది. అంత గొప్ప విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇవాన్ రాజు రష్యన్ రాజులైనట్సార్లలో ఉన్నతుడు అన్న పేరు తెచ్చుకున్నాడు



రోజుల్లో రష్యన్ రాజులనిట్సార్’ (Tsar) లు అనేవారు. ట్సార్ అన్న పదంసీసర్అన్న లాటిన్ పదం నుండి వచ్చింది. సీసర్ అనేది ఇటలో అసమాన రోమన్ చక్రవర్తుల వంశనామం. అలాంటి రాజవంశం యొక్క పేరుని స్వీకరించి ప్రాభవాన్ని మరింతగా చాటుకోవాలని చూశారు రష్యన్ రాజులు. ఇటు పోలండ్ నుండి అటు పసిఫిక్ మహాసముద్రం నుండి విస్తరించిన విశాల రష్యన్ సామ్రాజ్యం నిజానికి రోమన్ చక్రవర్తులు ఏలిన భూభాగాలకి విస్తీర్ణతలో మాత్రం తీసిపోదు.


ఇవాన్ అందించిన అద్భుతమైన వారసత్వంతో రంగ ప్రవేశం చేశాడు పీటర్ రాజు.

(ఇంకా వుంది)

No comments:

Post a Comment