Themes from World History

Themes from World History

Sunday, March 5, 2017

ప్రాచీన చైనీస్ ఖగోళ విజ్ఞానం





ఎన్నో ప్రాచీన సంస్కృతులలో లాగానే ప్రాచీన చైనాలో కూడా ఖగోళ విజ్ఞానం యొక్క ముఖ్య ప్రయోజనం కాలమానంగా పరిగణించబడేది. తారామండలంలో ప్రత్యేక తారా పథం మీదుగా ఏడాది పొడవునా సూర్యుడు సంచరిస్తాడన్న భావన ప్రాచీన చైనీస్ కి ఉండేది. పచ్చని కాంతులు కురిపించే సూర్యుడు నడిచే బాట కనుక బాటకిపచ్చని బాట’ (yellow path)  అని పేరు. బాటని మాసాలకి చిహ్నాలైన ‘12 గృహాలుగా విభజించారు.
చైనీస్ కాలమానం ఏడాదికి సరిగ్గా 365.25 రోజులు. అందుకే వీళ్లు వృత్తంలో కేంద్రం చుట్టూ ఉండే కోణాన్ని 365.25 భాగలుగా విభజించారు. ఆకాశపు గోళార్థాన్ని వీళ్లు నాలుగు సమ భాగాలుగా విభజించారు. వీటిల్లో ఒక్కొక్క భాగాన్ని మళ్లీ ఏడేసిమందిరాలుగా విభజించారు. అంటే మొత్తం 28 మందిరాలు అన్నమాట. మందిరాలలో చంద్రుడి గమనాన్ని అనుసరించేవారు.


28 మందిరాలు గల చైనీస్ తారాపథం

ప్రాచీన చైనీస్ ఖగోళ వేత్తలకి రాజుల పోషణ అమితంగా ఉండేది. కాలాన్ని కచ్చితంగా కొలవడం, ప్రతీ  నెల ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం, గ్రహణాలని ముందే నిర్ణయించడం మొదలైనవి వీళ్ల బాధ్యతలు. లెక్కలు తప్పయితే శిక్ష కఠినంగా ఉండేది. కొన్ని సార్లు శిరచ్ఛేదం వరకు కూడా వెళ్లేది

ఇతర సంస్కృతుల కాలమానాలలో వారాలు, నెలలు చక్రికంగా వస్తుంటాయి గాని, సంవత్సరాలలో అలాంటి చక్ర గతి ఉండదు. కాని ప్రాచీన చైనీస్ కాలమానంలో సంవత్సరాలలో  అలాంటి చక్రగతి కనిపిస్తుంది. ఉదాహరణకి   క్రీ.పూ. 2600 దరిదాపుల్లో జీవించిన హువాంగ్ టి అనే రాజు 60 సంవత్సరాల చక్రం గల కాలమానాన్ని ప్రవేశపెట్టాడు. కచ్చితమైన ఖగోళ పరిశీలనలు తీసుకునేందుకు వీలయ్యేలా గొప్ప నక్షత్రశాలని కూడా ఇతడు కట్టించాడు.

క్రీ.పూ. 4 శతాబ్దానికి చెందిన షి-షెన్ అనే ఖగోళవేత్త 122 తారా రాశులకి చెందిన 809 తారలని గుర్తిస్తూ కచ్చితమైన తారా పటాలు తయారుచేశాడు. ఇతడికి సూర్యబిందువులు (sunspots)  గురించిన జ్ఞానం కూడా ఉండేది.

క్రీ.. మూడు నుండి ఆరవ శతాబ్దాల నడిమికాలంలో చైనీస్ ఖగోళ విజ్ఞానం ఒక వెలుగు వెలిగింది. కాలానికి చెందిన ప్రముఖ ఖగోళవేత్త జు చాంగ్ జీ. ఇతడు ఏడాదిలో 365.24281481 రోజులు ఉన్నాయని కచ్చితంగా లెక్క వేశాడు.

క్రీ.. 960-1279 ప్రాంతంలో చైనాలో సాంగ్ వంశపు రాజులు పాలించిన కాలంలో ఎన్నో గొప్ప నక్షత్ర శాలలు వెలశాయి. 1,434 తారల ఆచూకీని వ్యక్తం చేసే విస్తారమైన తారా పటాలు నక్షత్రశాలలో ప్రదర్శించబడ్డాయి. సాంగ్ కాలంలో చివరి దశలో రంగప్రవేశం చేసిన గువో షౌజింగ్ అనే ప్రఖ్యాత చైనీస్ ఖగోళ వేత్త పెద్ద సౌరగడియారాన్ని (sundial)  నిర్మించాడు. గడియారం సహాయంతో ఏడాది యొక్క వ్యవధిని కేవలం 30 సెకనుల దోషంతో ఎంతో కచ్చితంగా కొలవగలిగాడు.

(ఇంకా వుంది)

No comments:

Post a Comment