Themes from World History

Themes from World History

Sunday, April 10, 2016

మొదటి ప్రపంచ యుద్ధం ... అలా మొదలయ్యింది



 మొదటి ప్రపంచ యుద్ధం - కొత్త సిరియల్ ప్రారంభం

ప్రపంచ చరిత్రలో ఆసక్తికరమైన ఘట్టాలని వర్ణించడం ఈ బ్లాగ్ లోని ముఖ్యోద్దేశం.

ఇటీవలి ప్రపంచ చరిత్రలో రెండు అత్యంత ముఖ్యమైన ఘట్టాలు ప్రపంచ యుద్ధాలు. మనకి తెలిసిన మానవ చరిత్రలో అంత స్థాయిలో జననష్టానికి దారి తీసి, అన్ని దేశాల భాగస్వామ్యం గలిగిన ప్రపంచ ఘట్టాలు ఆ రెండు కాక వేరేవి  లేదేమో.  అంత ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుగులో (నాకు తెలిసి) పుస్తకాలు లేకపోవడం ఆశ్చర్యకరం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం మీద సీరియల్ గా పోస్ట్ లు ప్రారంభిస్తున్నాను…

 


1. మొదటి ప్రపంచ యుద్ధం ఎలా మొదలయ్యింది?



జూన్ 28, 1914.
అది బాస్నియాలోని ప్రధాన నగరమైన సారయేవో. ఊరంతా రోజూ కోలాహలంగా వుంది. ముఖ్య రాదార్ల మీద పోలీసుల బందోబస్తు బలంగా వుంది. దానికి కారణం రోజు ముఖ్య అతిథి ఊరికి రానున్నాడు.

అతిథి పేరు ఫ్రాన్జ్ ఫెర్డినాండ్. ఇతగాడు విశాలమైన ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యానికి యువరాజు. రేపో మాపో సింహాసాన్ని అధిష్టించి సామ్రాజ్యాన్ని ఏలాల్సిన వాడు. రోజుల్లో బాస్నియా ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. బాస్నియాలో టౌన్ హాల్ లో ప్రభుత్వ సమావేశానికి హాజరు కావాలాని వస్తున్నాడు యువరాజు. తన భార్య సోఫీ కూడా తనతో యాత్రలో పాల్గొంది.

బాస్నియా గవర్నరు ఆస్కార్ పోటియోరెక్ స్వయంగా యువరాజుని, అతడి బృందాన్ని స్వాగతించేందుకు రైల్వే స్టేషన్ కి వెళ్లాడు. అతిథులు అందరూ కొంత మంది భద్రతా సిబ్బందితో పాటు ఆరు కార్లలో ఎక్కారు. మూడవ కార్లో ముఖ్య అతిథులంతా కూర్చున్నారు. అదో టాపులేని ఖరీదైన కారు.  దారి పొడవునా జనం బారులు తీరి వున్నారు. యువరాజు ఎక్కిన కారు కనిపించగానే హర్షధ్వానాలు మిన్నంటాయి. దూసుకుపోతున్న కారు మీద పూల గుచ్ఛాలు విసిరారు. యువరాజు ఫ్రాన్జ్ ఫెర్డినాండ్ కూడా నవ్వుతూ చెయ్యి ఊపాడు. ఊళ్లో తనకి ఇంత ఆదరణ లభిస్తుందని అతడు ఊహించలేదు.

అయితే రోజు ఫ్రాన్జ్ ఫెర్డినాండ్ కారు మీద పడ్డవి పూల గుచ్ఛాలు మాత్రమే కాదు. ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యం నుండి విచ్చేసిన అతిథులకి వినిపించినవి హర్షధ్వానాలు మాత్రమే కావు

దారిలో ఒకచోట  బారులు తీరిన జనానికి కాస్త వెనకగా ఒక వ్యక్తి దాక్కుని వున్నాడు. అతడి పేరు మెహ్మెడ్ బాసిక్. ఫెర్డినాండ్ ఎక్కిన కారు కనిపించగానే తన చేతిలో వున్న వస్తువు విసరమని అతడి పైవాళ్లు అతడికి ఇచ్చిన ఆజ్ఞ. అతడి చేతిలో వున్నది పూలగుచ్ఛం కాదు. బాంబు. మెహ్మెడ్ బాసిక్ కి ధైర్యం చాల్లేదు. కారు చెయ్యి దాటిపోయింది. మరి కాస్త దూరంలో అదే దారిలో బాంబుతో పాటు పిస్తోలు కూడా పట్టుకుని మరో వ్యక్తి అదను కోసం ఎదురుచూస్తున్నాడు. ఇతడి పేరు కబ్రినోవిచ్. కారు కాస్త దగ్గరికి రాగానే చేతిలో వున్న బాంబు విసిరాడు కబ్రినోవిచ్. కాని అది కారు పక్కలకి తగిలి జారి కింద పడి పేలిపోయింది. పేలుడులో వెనకనే వస్తున్న నాలుగో కారు బాగా దెబ్బ తింది. కబ్రినోవిచ్ సయనైడ్ మింగాలని చూశాడు గాని భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అతణ్ణి అరెస్ట్ చేశారు.

ప్రాణాపాయం తప్పింది అన్నమాటే గాని హఠాత్ పరిమాణానికి యువరాజుకి  దిమ్మదిరిగిపోయింది.  టౌన్ హాలులో సమావేశంలో పాల్గొన్నాడే గాని అతడి మనసు మనసులో లేదు. తనకి రక్షణ ఏర్పాట్లు సరిగ్గా జరగలేదని సమావేశంలో గవర్నర్ ని ఉద్దేశించి కాస్త నిష్ఠూరంగా మాట్లాడాడు. సమావేశం పూర్తి కాగానే మునుపట్లాగే అతిథులతో కార్లు వరుసగా నేషనల్ మ్యూజియమ్ కి బయల్దేరాయి. సారి దారిలో మరో ఆగంతకుడు కాచుకుని వున్నాడు. ఇతడి పేరు గవ్రిలో ప్రిన్సిప్. తన అనుచరులలా ఇతడు తన ప్రయత్నంలో విఫలం కాకూడదని పట్టుదలగా వున్నాడు. దురదృష్టవశాత్తు దారిలో కార్లు సరిగ్గా ఆగంతకుడు ఉన్నచోటే ఆగాల్సి వచ్చింది. అతగాడు ఇదే అదను అనుకుని పిస్తోల్ తీసి ఆస్ట్రియా-హంగరీ సామ్రాజ్యానికి కాబోయే రాజుని కాల్చి చంపాడు. కాల్పుల్లో అతడి భార్య సోఫీ కూడా మరణించింది.

 
టౌన్ హాల్ నుండి భార్య సోఫీతో బయటికి వస్తున్న ఫ్రాన్జ్ ఫెర్డినాండ్

మామూలుగా అయితే అలాంటి హత్యకి తీవ్రమైన పర్యవసానాలు ఉండకూడదు. ఫ్రాన్జ్ ఫెర్డినాండ్ సింహాసనాన్ని ఎక్కిన రాజు కూడా కాడు. కాబోయే రాజు మాత్రమే. మామూలుగా అయితే అతడి స్థానంలో మరొకరు రాజవుతారు. నాలుగు రోజుల్లో అంతా జరిగింది మర్చిపోతారు.   కాని సందర్భంలో అలా జరగలేదు. ఒకటి తరువాత ఒకటి ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశకి చెందిన అగ్రరాజ్యాలు  హత్యకి స్పందించాయి. రెండు వర్గాలుగా విడి పోరాటానికి దిగాయి. నాలుగు నెలల్లో తేలిపోతుంది అనుకున్న పోరు నాలుగేళ్ల పాటు సాగిన మహాసంగ్రామంగా పరిణమించింది. మొదటి ప్రపంచ యుద్ధం అలా మొదలయ్యింది.




(ఇంకా వుంది)

9 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  8. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  9. This comment has been removed by a blog administrator.

    ReplyDelete