Themes from World History

Themes from World History

Friday, April 1, 2016

యూరప్ లోని సాంకేతిక ఒరవడులని రష్యాకి తెచ్చిన పీటర్




రష్యా ప్రాబల్యాన్ని పెంచేందుకు గాని పీటర్ రాజు బృహత్ ప్రణాళికని రూపొందించాడు. అందులో మొదటి మెట్టుగా టర్కీ మీద తాను ప్రకటించబోతున్న యుద్ధంలో యూరప్ కి చెందిన ప్రధాన బలాల సహాయాన్ని అర్థిస్తూ దౌత్య బృందాన్ని సిద్ధం చేశాడు. బృందంలో పీటర్ తానే స్వయంగా పీటర్ మిఖాయిలోవ్ అనే పేరుతో సామాన్య నావికుడిగా మారువేషం వేసుకుని బయల్దేరాడు. అయితే దురదృష్ట వశాత్తు దౌత్యం విఫలమయ్యింది. అయితే యాత్రని సద్వినియోగం చేసుకోదలచుకున్నాడు పీటర్. యూరప్ యొక్క ప్రాబల్యంలోని రహస్యం దాని పరిజ్ఞానమే నని పీటర్ కి ముందే తెలుసు. కాని పరిజ్ఞానాని వేళ్లు ఎక్కడున్నాయో స్వయంగా వెళ్లి చూడాలనుకున్నాడు. పరిజ్ఞానపు అంకురాలని తనతో తెచ్చుకుని వాటిని రష్యాలో నాటి, శ్రద్ధగా పెంచి పోషించాలనుకున్నాడు.

ప్రష్యన్ సామ్రాజ్యం ( నాటి జర్మనీ) లో తుపాకుల పరిశ్రమలని సందర్శించాడు. పటిష్టమైన తుపాకుల పరిశ్రమ లేకుండా సమకాలీన ప్రపంచంలో యుద్ధాలు గెలవడం అసంభవం అని తెలుసుకున్నాడు. అలాగే ఇంగ్లండ్ లోను, హోలాండ్ లోను బాగా అభివృద్ధి చెందిన నౌకా నిర్మాణ పరిశ్రమలని కూడా సందర్శించాడు. ఇంగ్లండ్, హోలాండ్ తదితర స్కాండినావియాకి చెందిన దేశాలు చారిత్రకంగా సముద్ర యానంలో గొప్ప పేరున్న దేశాలు. దేశాల నుండి తన దేశం నేర్చుకోవలసింది ఎంతో వుందని తెలుసుకున్నాడు పీటర్ రాజు.

పీటర్ ఇంగ్లండ్ ని సందర్శిస్తున్నప్పుడు అతణ్ణి కలుసుకున్న ఇంగ్లీష్ బిషప్  పీటర్ గురించివదరుబోతని, తాగుబోతని, చేష్టల్లో మోటుగా ఉంటాడని, చూడడానికి రాజు లాగా కాక ఓడలు నిర్మించే వడ్రంగిలా ఉంటాడనివర్ణిస్తాడు. మరి రాజమందిరాల పరిశుభ్ర పరిసరాలలో కన్నా ఎక్కువగా కర్మాగారాలలో తిరుగుతూ మాసిన బట్టలతో కనిపించే విడ్డూరపు యువరాజుని చూసినప్పుడు చూపరులకి తప్పుడు అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల చెట్టంత విగ్రహంతో, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే రష్యన్ యువరాజుని చూసినప్పుడు మొరటోడు అనుకోవచ్చు గాని మొనగాడని ఒప్పుకోని వారు ఉండరేమో.
మరి సాంకేతిక విషయాలంటే వల్లమాలిన మక్కువ గల యువరాజు సున్నిత స్వభావుడు అనుకుంటే పొరబాటే.

 పీటర్ తన యాత్రలలో మునిగితేలడం అదనుగా తీసుకుని అతడు అనుచరులలో ఒకడు, తన చెల్లెలితో కలిసి పన్నాగం పన్ని పీటర్ సింహాసనాన్ని దురాక్రమించాలని చూశాడు. పీటర్ గెద్దెని ఆక్రమించాలని చూసినవాడుస్టెల్ట్ సీ’ (steltsi)  అనే ఒక ప్రత్యేక సిపాయిల బృందానికి చెందినవాడు. అది తెలుసుకున్న పీటర్ రాజు ఆలస్యం చెయ్యకుడా స్వరాజ్యానికి తిరిగి వెళ్లాడు. తన మీద కుట్ర చేసినవారికి తగిన శాస్తి చెయ్యాలనుకున్నాడు. మళ్లీ అలాంటి అవాంతరం జరగకుండా జనంలో రాజు పట్ల భయం కలిగించేలాస్టెల్ట్ సీవర్గం వారిని పట్టి బంధించి, బహిరంగంగా కొరడాలతో కొట్టించాడు. కొందర్ని బహిరంగంగా సజీవ దహనం చెయ్యించాడు. సందర్భంలో  కొన్ని వేల మంది అతడి ఆగ్రహానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు.

నానాటికి అదుపు చెయ్యడం కష్టమవుతున్నస్టెల్ట్ సీసిపాయిలని తొలగించి వారి స్థానంలో ఆధునిక పద్ధతుల ప్రకారం సుశిక్షితులైన రెండు వేల మంది సైనిక అధికారులని ప్రవేశపెట్టాడు. రాజ్యంలో శాంతిభద్రతలు స్థాపించి తిరుగుబాట్లని అణచే బాధ్యత వారి మీద పెట్టాడు. కొత్త సైనిక వ్యవస్థ మరింత క్రమశిక్షణతో వ్యవహరిస్తుందని, సంకట పరిస్థితిలో తన మాట వింటుందని, తనకి విధేయమై వుంటుందని నమ్మకం కుదిరిన పీటర్ తన సంస్కరణల మీదకి మళ్లీ దృష్టి సారించాడు. తన వైజ్ఞానిక యాత్రలని మళ్లీ కొనసాగించాడు.

పాశ్చాత్య లోకపు పర్యటనల నుండి సేకరించిన అనుభవంతో రష్యాలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు పీటర్ రాజు. ఒక సంస్కృతి నుండి మరో సంస్కృతి నేర్చుకోవలసినది కేవలం వేషభాషలు మొదలైన పైపై విషయాల అనుకరణ కాదు. సంస్కృతి ప్రాబల్యానికి ఆధారమైన పరిజ్ఞానాన్ని, ఆలోచనా విధానాన్ని పుణికి పుచ్చుకోవాలి. కాని పీటర్ ప్రవేశపెట్టిన  సంస్కరణల్లో వేషభాషలకి సంబంధించిన కొన్ని కొత్త పద్ధతులు ఎన్నో ఉన్నాయి.  టర్కీ, రష్యా ప్రాంతాలలో  ఇంతింతేసి పొడవాటి గడ్డాలు నిమురుకుంటూ,  మీసాలు మెలేసుకుంటూ పురుషలు బడాయిలు పోయేవారు. బడాయిని కత్తిరించుకోమని, పాశ్చాత్య యూరప్ పద్ధతిలో పొందికైన గడ్డాలు, మీసాలే కనిపించాలని ఆంక్షలు విధించాడు. అలాగే సిపాయిల వేషధారణలో పొడవాటి అంగరఖాలకి బదులు కాస్త పొట్టివైన జాకెట్ లని ప్రవేశపెట్టాడు. రాజమందిరంలో స్త్రీలు పురుషులు యూరపియన్ సమాజాలలో లాగా స్వేచ్ఛగా కలుసుకునే ఆచారాలు ప్రవేశపెట్టాడు.

 


గడ్డం గీసుకోమని సభాసదుల మీద ఆంక్షలు పెడుతున్న పీటర్



అనవసరమైన వేషభాషల కన్నా మరింత మౌలికమైన విద్యా సంబంధమైన సంస్కరణల మీద రాజు మనసు లగ్నం చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయని విమర్శలు లేకపోలేదు. అలాంటి సంస్కరణలు కూడా పీటర్ రాజు ఎన్నో చేశాడు. ఇంజినీర్లు, నావికులు, అస్త్ర శస్త్రాల నిపుణులు మొదలైన వారికి తగ్గ శిక్షణ లభించేలా కళాశాలలు స్థాపించాడు. విధంగా సాంకేతిక విద్యకి పెద్ద పీట వేశాడు. సాంకేతిక విద్యతో మొదలైన కొత్త ఒరవడి ఇతర వైజ్ఞానిక విద్యా రంగాల వృద్ధికి దారి తీసింది. కొత్త చదువుల పుణ్యమా రష్యాలో మొట్టమొదటి సారిగా కొత్తమేధావి వర్గం” (intelligentsia) ఆవిర్భవించింది.   మేధావి వర్గం తదనంతరం రష్యన్ సామ్రాజ్య పురోగతిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

(ఇంకా వుంది)





No comments:

Post a Comment